బండి సంజయ్ సింపతి వల్ల గెలిచిండు : సునీల్ రావు

బండి సంజయ్ సింపతి వల్ల గెలిచిండు : సునీల్ రావు

కేసీఆర్ సర్కారుపై బండి సంజయ్ వ్యాఖ్యలను కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఖండించారు. ముఖ్యమంత్రి అభివృద్ధిని గాలికొదిలేసిండన్న బండి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్, వ్యవసాయం, రైతుల ఆత్మహత్యలపై సంజయ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బండి సంజయ్కు ఎన్నికలు తప్ప అభివృద్ధి అనేది తెలియదని విమర్శించారు. బండి సంజయ్ రెండుసార్లు ఓడిపోయిన సింపతితో పొరపాటున ఎంపీగా గెలిచారని విమర్శించారు. అవాస్తవాలు, అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పబ్బం గడపడం సంజయ్ కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు.