చెట్టుకు అంతిమ యాత్ర నిర్వహించి వినూత్నంగా నిరసన

చెట్టుకు అంతిమ యాత్ర నిర్వహించి వినూత్నంగా నిరసన

కరీంనగర్: హుజురాబాద్ పట్టణంలో కొంద‌రు గుర్తుతెలియని వ్యక్తులు చెట్లను నరికి వేయగా వాటికి అంతిమ యాత్ర నిర్వహించి వినూత్నంగా నిరసన తెలిపారు సేవ్ ద ట్రీస్ సభ్యులు. పట్టణంలోని స్థానిక హైస్కూల్ క్రీడా మైదానంలో నాటిన మొక్కలను బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయమై సేవ్ ద ట్రీస్ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేసినా.. స్పందించకపోవడంతో.. వారు ఆ చెట్టును మోస్తూ హై స్కూల్ నుంచి పట్టణంలోని వీధుల మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అక్కడినుంచి తీసుకొని వెళ్లి మున్సిపల్ కార్యాలయం ముందు వేసి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సేవ్ ద ట్రీస్ సభ్యులు వినూత్నంగా నిర్వహించిన చెట్టు అంతిమయాత్ర అందరిని ఆలోచింపజేసింది