- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 418 గ్రామాల్లో 3,011 మంది నామినేషన్
- మొదటి దశలో 19 గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం
కరీంనగర్/పెద్దపల్లి/రాజన్నసిరిసిల్ల/జగిత్యాల, వెలుగు: రెండో దశలో ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో మంగళవారం రాత్రి వరకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 418 గ్రామాల్లో 3,011 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బుధవారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కాగా.. 19 గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మూడో దశలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది.
తొలి విడతలో 19 గ్రామాలు ఏకగ్రీవం
మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో నామినేషన్ల ఉపసంహరణ బుధవారంతో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చొప్పదండి మండలం దేశాయిపేట సర్పంచ్ తోపాటు 8 వార్డులు, పెద్దకురుమపల్లి సర్పంచ్‌తోపాటు 5 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట సర్పంచ్‌గా తొట్ల చిన్నయ్య, కథలాపూర్ మండలం రాజారాంతండా- తిరుపతినాయక్, ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ -శేఖర్, యామపూర్ సర్పంచ్‌గా కనుక నగేశ్‌గా ఏకగ్రీవమయ్యారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో 9 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. రుద్రంగి మండలంలోని 10 జీపీలకు ఏడు గ్రామాలు అడ్డబోర్‌తండా, చింతామణి తండా, గైదిగుట్ట తండా, రూప్లా నాయక్ తండ, సర్పంచ్ తండా, వీరుని తండా, బడి తండా జీపీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే ఇదే మండలంలో 86 వార్డులకు గానూ 52 మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. కోనరావుపేట మండలంలో కమ్మరిపేట తండా, ఊరుతండా గ్రామాలు, వేములవాడ రూరల్ మండలంలో 146 వార్డులకు గానూ 40 ఏకగ్రీవయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని నాగారం, మైదుపల్లి, తోటగోపయ్యపల్లి పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
మండలం గ్రామాలు నామినేషన్లు
తంగళ్లపల్లి 30 219
బోయిన్ పల్లి 23 190
ఇల్లంతకుంట 35 194
మొత్తం 88 603
రెండో విడతలో సర్పంచులు, వార్డు స్థానాలకు నామినేషన్లు ఇలా..
కరీంనగర్ జిల్లా..
మండలం గ్రామాలు నామినేషన్లు
చిగురుమామిడి 17 147
గన్నేరువరం 17 133
మానకొండూరు 29 202
శంకరపట్నం 27 226
తిమ్మాపూర్ 23 180
మొత్తం 113 888
జగిత్యాల జిల్లాలో..
మండలం గ్రామాలు నామినేషన్లు
బీర్పూర్ 17 85
జగిత్యాల 5 37
జగిత్యాల(రూ) 29 179
కొడిమ్యాల 24 165
మల్యాల 19 151
రాయికల్ 32 205
సారంగాపూర్ 18 119
మొత్తం 144 941
పెద్దపల్లి జిల్లా
మండలం గ్రామాలు నామినేషన్లు
అంతర్గాం 15 111
ధర్మారం 29 228
జూలపల్లి 13 100
పాలకుర్తి 16 140
మొత్తం 73 579
