కాంగ్రెస్​లోకి కరీంనగర్ జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్?

కాంగ్రెస్​లోకి కరీంనగర్ జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్?

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ త్వరలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను సోమవారం ఆమె హుస్నాబాద్ లో కలిసి సత్కరించడం, రాజకీయాంశాలపై ప్రత్యేకంగా మాట్లాడుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జడ్పీ చైర్ పర్సన్ పదవీ కాలం దగ్గరపడుతుండడం, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో మళ్లీ పోటీలో నిలిచేందుకు విజయతోపాటు మరికొందరు జడ్పీటీసీలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.

త్వరలో చివరిసారిగా జరగబోయే జడ్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆహ్వానించేందుకే మంత్రిని కలిసినట్లు బయటికి చెప్తున్నప్పటికీ..  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరేందుకే సంప్రదింపులు జరుపుతున్నట్లు చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్, గంగాధర జడ్పీటీసీ పుల్కం అనురాధ, కరీంనగర్ రూరల్ జడ్పీటీసీ పురుమళ్ల లలిత కాంగ్రెస్ లో జాయిన్ కాగా.. ఎన్నికల తర్వాత కొత్తపల్లి జడ్పీటీసీ పిట్టల కరుణ చేరారు. కాగా మంత్రిని కలిసినవారిలో జడ్పీటీసీలు గీకురు రవీందర్, శేఖర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.