
పెండింగ్ బిల్లులు ఇస్తామంటేనే టీఆర్ఎస్ లో చేరానన్నారు కరీంగనర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి. తనకు 59 లక్షల బిల్లు రావాలని... బిల్లులు ఇవ్వకపోగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. బిల్లులు ఇప్పిస్తామని హామీ ఇస్తేనే తాను టీఆర్ఎస్ లో చేరినట్టు ఎల్లారెడ్డి స్పష్టం చేశారు. 15 లక్షలు మాత్రమే ఇచ్చి... మిగతా బిల్లు ఇవ్వడంలేదని ఎల్లారెడ్డి ఆరోపించారు. తాను మొదట్నుంచి ఈటల రాజేందర్ మనిషేనని... తాను ఈటల సొమ్ము తిన్నట్టు చెప్పారు. ఈ మధ్యే టీఆర్ఎస్ లో చేరిన ఎల్లారెడ్డి... ఇవాళ ఈటల జమునను కలసి మద్దతు ప్రకటించారు.