కాంగ్రెస్, జేడీఎస్ మంత్రుల రాజీనామా : టెన్షనేం లేదన్న సీఎం కుమార

కాంగ్రెస్, జేడీఎస్ మంత్రుల రాజీనామా : టెన్షనేం లేదన్న సీఎం కుమార

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం పీక్స్ కు చేరింది. కాంగ్రెస్ మంత్రులు 21 మంది ఈ ఉదయం రాజీనామా చేశారు. లేటెస్ట్ గా జేడీఎస్ మంత్రులు ఆరుగురు తమ పదవులకు రాజీనామాలు చేశారు. జేడీఎస్ నాయకులు ఈ ఉదయం సమావేశమై రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

సీఎం కుమారస్వామి స్పందన

కర్ణాటకలో రాజకీయం సంక్షోభంపై సీఎం కుమారస్వామి స్పందించారు. బెంగళూరులో ఆయన్ను మీడియా ప్రశ్నించినప్పుడు.. ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు,  ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంపై తనకేమాత్రం టెన్షన్ లేదన్నారు. తాజా రాజకీయ పరిణామాలతో తాను ఎటువంటి ఆతృతకు లోనుకావడం లేదని అన్నారు. రాజకీయాలపై కూడా తాను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదని ఆయన అన్నారు. తొందరేంలేదని.. మంత్రివర్గం మళ్లీ కొత్తగా ఏర్పాటవుతుందన్నారు.

ఈ ఉదయం కాంగ్రెస్ మంత్రుల రాజీనామా

కర్ణాటక సంకీర్ణ సర్కార్ లోని కాంగ్రెస్ మంత్రులు ఈ ఉదయం రాజీనామా చేశారు. ఈ పదవుల్ని కాంగ్రెస్ పార్టీ లోని రెబల్స్ కు ఇచ్చే అవకాశాలున్నాయి.  ఉదయం డిప్యూటీ సీఎం పరమేశ్వర…పార్టీ మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. భవిష్యత్తు వ్యూహాలపై చర్చించారు. ఫైనల్ గా రెబల్స్ ని దారిలోకి తేవాలంటే.. మంత్రి పదవుల పంపకమే ఫైనల్ అని తేల్చినట్టు తెలుస్తోంది. దీనికోసమే ప్రస్తుత మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసినట్టు సమాచారం.

ఇవీ కర్ణాటక అప్ డేట్స్

మరోవైపు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, మంత్రి నగేష్.. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

అటు తిరుగుబాటు ఎమ్మెల్యే రామలింగారెడ్డితో సీఎం కుమారస్వామి రహస్యంగా సమావేశమయ్యారు. సిద్ధరామయ్యను సీఎం చేయాలని రామలింగారెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

ఐతే.. గవర్నర్ ఆహ్వానిస్తే సర్కార్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ చెబుతోంది.