కర్నాటకలో లాక్‌‌డౌన్.. ఇంటికే మద్యం

కర్నాటకలో లాక్‌‌డౌన్.. ఇంటికే మద్యం

బెంగళూరు: కర్నాటకలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర రాజధాని బెంగళూరులో సోమవారం ఒక్కరోజే 17,342 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కర్నాటకలో యాక్టివ్ కేసుల సంఖ్య 2.34 లక్షలకు చేరుకోగా.. ఒక్క బెంగళూరులోనే 1.6 లక్షలు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులపాటు లాక్‌‌డౌన్ విధిస్తున్నట్లు యడ్యూరప్ప సర్కార్ అనౌన్స్ చేసింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి కరోనా కర్ఫ్యూ అమలులో వస్తుందని పేర్కొంది. 

అత్యవసర సేవలను ఉదయం 6 నుంచి 10 గంటలకు వరకు అనుమతిస్తున్నట్లు యడ్డీ గవర్నమెంట్ తెలిపింది. పొద్దున పదింటి తర్వాత దుకాణాలను మూసేయాలని ఆదేశించింది. కన్‌‌స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ సెక్టార్‌‌ సంబంధిత వ్యాపారాలకు మాత్రమే ఓపెన్ చేసి ఉంచడానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. మద్యం కావాలనుకునే వారికి హోం డెలివరీ చేస్తామని పేర్కొంది. ప్రజా సేవలను నిలిపివేస్తున్నామని వివరించింది. రాష్ట్రంలో షెడ్యూల్ చేసిన ఎన్నికలను కనీసం మూడు నెలల వరకు నిలిపివేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్‌‌కు యడ్యూరప్ప కేబినెట్ లేఖ రాసింది.