ఉప రాష్ట్రపతి సిఫార్సు లెటర్ ఫోర్జరీ

ఉప రాష్ట్రపతి సిఫార్సు లెటర్ ఫోర్జరీ

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సిఫార్సు లేఖను ఫోర్జరీ చేశాడు తిరుమల శ్రీవారి భక్తుడు. శ్రీవారి దర్శనం చేసుకునేందుకే.. ఇంటర్నెట్ ద్వారా లెటర్ ఫ్యాడ్ ను ఫోర్జరీ చేసి అందులో తన కుటుంబ సభ్యుల జాబితాను పోందు పరిచి.. ఆ లెటర్ ను టీటీడీ ఆఫీస్ లో సబ్మిట్ చేశాడు.

ఆ లెటర్ ను గుర్తించిన జేఈవో కార్యాలయ సిబ్బంది..  అనుమానం రావడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.  విజిలెన్స్ అధికారులు ఆ లెటర్ ను నకిలీగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఫోర్జరీకి పాల్పడిన వ్యక్తి కర్నాటక రాష్ట్రం కోలార్ కు చేందిన ఏంబీఏ విద్యార్ధి కిషోర్ కుమార్ గా గుర్తించారు.

తిరుమల టూటౌన్ పోలీసులు కిషోర్ ను అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేసుకున్నారు. శ్రీవారిని అతి దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో కిషోర్ ఇలాంటి ఆకతాయి తనానికి పాల్పడినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.