కర్ణాటకలో కోవిడ్ ఆంక్షలు సడలింపు

కర్ణాటకలో కోవిడ్ ఆంక్షలు సడలింపు

కర్ణాటక ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను సడలించింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో సినిమా థియేటర్స్, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్,యోగా కేంద్రాలను పూర్తి సామర్థ్యంతో నడుపుకోవచ్చని స్పష్టం చేసింది. కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. టెక్నికల్ అడ్వైజరీ కమిటీతో సమావేశమైన సీఎం బొమ్మై కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకునేందుకు అనుమతించిన ప్రభుత్వం..ఇప్పుడు పూర్తిస్థాయిలో సినిమా హాల్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ లు, యోగా సెంటర్స్ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. వీటిల్లోకి ఎంటర్ అవ్వాలంటే డబుల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. అలాగే థియేటర్స్ లో ప్రేక్షకులు మాస్కలు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. సినిమా హాల్స్ లోకి ఆహార పదార్థాలను అనుమతించరాదని ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరులో పాజిటివిటీ రేటు 27.2 శాతం నుంచి 11.7 శాతానికి తగ్గిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం

కేరళలో తగ్గుతున్న కోవిడ్ కేసులు

గోవాలో పేదలకు ఏటా రూ.72 వేలు ఇస్తం