కేరళలో తగ్గుతున్న కోవిడ్ కేసులు

కేరళలో తగ్గుతున్న కోవిడ్ కేసులు

దైవ భూమి కేరళలో కరోనా కరాళా నృత్యం చేస్తోంది. మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా కేసులు అదుపులోకి రావడం లేదు. ప్రజలు కోవిడ్ రూల్స్ పాటిస్తున్నా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,684 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 41,037 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా,28 మంది మృత్యువాత పడ్డారు. కేరళలో పాజిటివిటీ రేటు 10 శాతానికి తగ్గింది. మరణాల రేటు కూడా 0.9శాతంగా నమోదైంది. ఇది జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉందని రాష్ట్రవైద్యారోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం

నేను సహాయక నటుడిని కాదు:సిద్ధూ

విచారణ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది