విచారణ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది...ప్రియాంక గాంధీ

విచారణ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది...ప్రియాంక గాంధీ
  • యూపీలో మాదే విజయం

విచారణ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ..ప్రజలను, ప్రతిపక్షాలను భయపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. పంజాబ్ సీఎం చన్నీ మేనల్లుడు భూపిందర్  అరెస్ట్ అందులో భాగమేనన్నారు. ఎన్నికల సమయంలో ఇలా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. మోదీ ఎన్ని కుట్రలు పన్నినా యూపీలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

 

ఇవి కూడా చదవండి..

గద్దెల దాకా తీసుకుపోతాం.. ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కండి

పాక్ ఫాస్ట్ బౌలర్పై ఐసీసీ సస్పెన్షన్