ఇల్లును కొవిడ్​ కేర్​ సెంటర్​గా మార్చిన మంత్రి

ఇల్లును  కొవిడ్​ కేర్​ సెంటర్​గా మార్చిన మంత్రి

బెంగళూరు: కరోనా కేసులు భారీగాపెరుగుతుండటంతో కర్నాటక హోంమంత్రి బస్వారాజు బొమ్మై హవేరి జిల్లా షిగ్గావిలోని తన ఇంటిని కొవిడ్​కేర్​సెంటర్​(సీసీసీ)గా మార్చారు. 50 మంది పేషెంట్లకు వసతులతో ఆ ఇంటి ఆవరణలో ఏర్పాట్లు చేశారు. అక్కడ వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, ఇతర సిబ్బందిని కూడా నియమించినట్లు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఇంటి వరండాలో 50 బెడ్లతో పాటు సివియర్​ పేషెంట్లకు అవసరమైన ఆక్సిజన్​ను​ అందించేందుకు కాన్సంట్రేటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. ఓ మంత్రి తన నివాసాన్ని కొవిడ్​కేర్​సెంటర్​గా మార్చడం ఇదే తొలిసారని.. దీనివల్ల నియోజకవర్గంలోని తాలూకా ఆస్పత్రిపై భారం కూడా తగ్గుతుందని పేర్కొన్నాయి.