
బెంగళూరు : పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరుకు రాగానే ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేస్తామని కర్నాటక హోంమంత్రి జీ పరమేశ్వర తెలిపారు.
జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికలకు ప్రజ్వల్‌కు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అతడు ఏప్రిల్ 27న జర్మనీకి పారిపోయాడు. ఈ నెల 31న తెల్లవారుజామున ఆయన బెంగళూరుకు చేరుకొనే అవకాశం ఉంది.