సాఫ్ట్ వేర్ కంపెనీల ప్రతినిధులతో కర్ణాటక ఐటీ మినిస్టర్ భేటీ

సాఫ్ట్ వేర్ కంపెనీల ప్రతినిధులతో కర్ణాటక ఐటీ మినిస్టర్ భేటీ

కర్ణాటక రాజధాని బెంగళూరును వరదలు ముంచెత్తాయి. గ త 75 ఏళ్లలో సెప్టెంబరు నెలలో కురిసిన మూడో అత్యధిక వర్షపాతం అని నివేదికలు వచ్చాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు వ ర్ణ నాతీతంగా ఉన్నాయి.  బెంగ ళూరు సిటీ వైట్ ఫీల్డ్ ప్రాంతానికి సమీపంలో స్కూటీ పైనుంచి అఖిల అనే యువతి కింద పడింది. వరదలో పడకుండా ప క్క నే ఉన్న ఉన్న ఒక విద్యుత్ స్తంభాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. అయితే, వ ర్షాల కార ణంగా స్తంభానికి విద్యుత్ ప్ర వాహం ఉండ టంతో కరెంట్ షాక్ తో అఖిల చనిపోయింది. ప్రభుత్వం, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే అఖిల చనిపోయినట్లు ఆరోపిస్తున్నారు బంధువులు.

భారీ వర్షంతో బెంగళూరులో ఎక్కడిక క్క డ వాహనాలు నిలిచిపోయాయి. ఎటు చూసినా వరద  కనిపిస్తోంది. ఈ నెల 9 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది . ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. బెంగళూరు, కొడగు, శివమొగ్గ, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి, చిక్కమంగళూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్  ప్రకటించింది.

బెంగళూరులో పరిస్థితులు కష్టంగా ఉన్నాయని అన్ అకాడమీ డైరెక్టర్ గౌరవ్ ముంజాల్ ట్వీట్ చేశారు. నీట మునిగిన తన సొసైటీ నుంచి ఒక ఫ్యామిలీని ట్రాక్టర్ లో తరలించారన్నారు. ఏదైనా సాయం కావాలంటే నేరుగా తనకు మెసేజ్ చేయాలని.. ట్రాక్టర్ లో తరలిస్తోన్న వీడియోను షేర్ చేశారు. 

ఇప్పటికే అప్ గ్రేడ్ సీఈవో ట్రాక్టర్ ఎక్కి ఆఫీస్ కు వెళ్లిన వీడియోలు వైరల్ గా మారియి. భారీ వర్షాలతో తన నివాసంలో పవర్  లేదని, దాంతో ట్రాక్టర్ లో ఆఫీస్ కు వెళ్లినట్లు తెలిపారు అప్ గ్రేడ్ సీఈవో. ఆదివారం రాత్రి కురిసిన వర్షాల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది.  బెళ్లందూర్ , షార్జాపురా రోడ్డు, అవుట్ రింగ్  రోడ్ , బీఈఎంఎల్  లేఅవుట్  ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఈ వర్షాల కారణంగా ఐటీ కంపెనీలకు రూ.225 కోట్ల నష్టం వాటిల్లింది. దీనిపై ఐటీ కంపెనీలు సీఎం బొమ్మైకు లేఖ రాశాయి.

ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఐటీ కంపెనీల ప్రతినిధులతో కర్ణాటక ఐటీ మంత్రి అశ్వత నారాయణ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ సహా పలు సాఫ్ట్ వేర్ కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు. వర్షం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎస్, బృహత్ బెంగళూరు మహానగర పాలికె చీఫ్, వాటర్ అధికారులు, అర్బన్ డెవలప్ మెంట్ అధికారులు, బెంగళూరు సీపీ పాల్గొననున్నారు.