మర్డర్ కేసులో 14 ఏళ్లు జైలుకెళ్లి డాక్టర్ అయ్యిండు

మర్డర్ కేసులో 14 ఏళ్లు జైలుకెళ్లి డాక్టర్ అయ్యిండు

అతని పేరు సుభాష్ పాటిల్… కర్నాటకలోనికలబురిగి స్వస్థలం. పాటిల్ కు చిన్నప్పటినుంచి డాక్టర్ కావాలనేది కల. దాన్ని నిజం చేసుకోవాలని ఎంతో కష్టపడుతుండేవాడు. ఈ క్రమంలోనే 1997లో ఎంబీబీఎస్ సీటు సంపాదించాడు. చదువు సాఫీగా సాగుతోంది.ఇంకా కొన్ని రోజులైతే ఎంబీబీఎస్ అయిపోతుందనగా పాటిల్ కల చెదిరిపోయింది. ఓమర్డర్ కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కోర్టు 2006లో జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. జైలులోనే డాక్టర్ గా పనిచేయడం ప్రారంభించాడు పాటిల్. అక్కడి ఔట్ పేషెంట్ డిపార్ట్ మెంట్ లో సేవలందించాడు. పాటిల్ మంచి ప్రవర్తనతో మెలగడంతో 2016 లో ఇండిపెండెన్స్ డే రోజున రిలీజ్చేశారు. బయటకొచ్చిన పాటిల్ తన కలను ఎలాగైనా నెరవేర్చుకోవాలని మళ్లీ ఎంబీబీఎస్ కంటిన్యూ చేశాడు. 2019లో చదువు అయిపోగా ఈ ఏడాది జనవరిలో వన్ ఇయర్ఇంటర్న్​షిప్ కంప్లీట్ చేసిన పాటిల్ త్వరలో ఎంబీబీఎస్ పట్టా అందుకోనున్నాడు.