బైక్ ట్యాక్సీలను నిలిపేయాలన్న కర్ణాటక

బైక్ ట్యాక్సీలను నిలిపేయాలన్న కర్ణాటక
  • ర్యాపిడో కంపెనీకి ఆదేశం
  • ఇది వరకే 200 బైక్‌ ట్యాక్సీల స్వాధీనం

బెంగళూరు: రూల్స్‌‌ను పట్టించుకోకుండా బైక్‌ ట్యాక్సీ సేవలను అందిస్తున్నారంటూ ఇది వరకే ఓలాకు రూ.15 లక్షల జరిమానా విధించిన కర్ణా టక ప్రభుత్వం , మరో బైక్‌ ట్యాక్సీ సేవల కంపెనీ ర్యాపిడో పైనా కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా బైకు ట్యాక్సీ సర్వీసులను అందిస్తున్న ఈ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రవాణా శాఖ ప్రకటించింది. బైక్‌ ట్యాక్సీలను వెంటనే ఆపేయాలని కూడా ఆదేశించిం ది. ‘‘సేవలను నిలిపేయాలని ఆదేశిస్తూ ర్యాపిడోకు నోటీసులు పంపించాం . ఈ విషయమై ఆ కంపెనీ పంపిన సమాధానం సంతృప్తికరంగా లేదు.చట్టపరమైన చర్యలూ తీసుకుంటాం ’’ అని రవాణా శాఖ అదనపు కమిషనర్ నరేంద్ర హోల్కర్‌‌ చెప్పారు.

రవాణాశాఖ అధికారులు శుక్రవారం 170 ర్యాపిడో బైక్‌ ట్యాక్సీలను సీజ్‌ చేశారు. గురువారం 18, బుధవారం 24 బైకులను స్వాధీనం చేసుకున్నా రు. వీటికి సంబంధించి కేసులు నమోదు చేస్తున్నామని, బైకుల రిజిస్ట్రేషన్‌‌ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నామని రవాణాశాఖ జాయింట్‌‌ కమిషనర్‌‌ జ్ఞానేంద్ర కుమార్‌‌ వివరించారు. ‘‘వైట్‌‌ నెంబర్‌‌ ప్లేట్స్‌‌ ఉన్నబైకులను వ్యాపారం కోసం వాడుతున్న ర్యాపిడో పై కేసు నమోదు చేస్తాం. బైకులను సీజ్‌ చేయడం ఇకనుంచి కొనసాగిస్తాం. వైట్‌‌ ప్లేట్‌‌ బైకులతో వ్యాపారం చేయడం మోటారు వాహనాల చట్టానికి విరుద్ధం . డ్రైవర్లు ర్యాపిడో వంటి కంపెనీలకు దూరంగా ఉండాలి’’అని ఆయన అన్నారు.

కర్ణాటక ప్రభుత్వం ఓలాకు విధించినట్టుగానే ర్యాపిడోకు కూడా భారీ జరినామా విధించే అవకాశాలు ఉన్నా యి. అధికారులు ఓలాకు అటాచ్‌‌ అయిన 250 బైకులను గత నెల సీజ్‌ చేసి ఒక్కో దానికి రూ.ఆరు వేల జరిమానా వేశారు.దీంతో హైకోర్టుకు వెళ్లిన ఓలా మిగతా బైక్‌ ట్యాక్సీలనూ స్వాధీనం చేయాలని ఫిర్యాదు చేసింది. ఫైన్‌‌ చెల్లించడానికి సిద్ధమని ఉన్నతాధికారులకు హామీ ఇవ్వడంతో సర్వీసులను పునరుద్ధరిం చారు.