కరోనా బారినపడ్డ ఇద్దరు ముఖ్యమంత్రులు

కరోనా బారినపడ్డ ఇద్దరు ముఖ్యమంత్రులు

బీహార్ సీఎం నితీశ్ కుమార్ రెండోసారి కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. డాక్టర్ల సూచనల మేరకు ఆయన హోం ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని నితీశ్ కుమార్ కోరారు. నితీశ్కు కరోనా సోకడం ఇది రెండోసారి. 2020లోనూ ఆయనకు కోవిడ్ సోకింది. బీహార్ లో కొన్ని రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 4,737మందికి వైరస్ సోకింది. ప్రస్తుతం బీహార్ లో 20,938 యాక్టివ్ కేసులున్నాయి.

ఇదిలా ఉంటే కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని ట్విట్టర్ లో ప్రకటించారు. ప్రస్తుతం సీఎం హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని బసవరాజ్ కోరారు. కర్నాటకలో గత 24 గంటల్లో 11,698 కొత్త కేసులు నమమోదయ్యాయి. కరోనా కారణంగా ఈ రోజు నలుగురు చనిపోయారు.