కేజీఎఫ్లో మళ్లీ గోల్డ్ మైనింగ్కు యోచన ?

కేజీఎఫ్లో మళ్లీ గోల్డ్ మైనింగ్కు యోచన ?

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) .. అంతులేని బంగారు ఖనిజ నిల్వలకు పెట్టింది పేరు. 20 ఏళ్ల క్రితం ఇందులో గోల్డ్ మైనింగ్ ను ఆపేశారు.  అయితే ఆ గోల్డ్ ఫీల్డ్స్ లో  ఇంకా దాదాపు 50 మిలియన్ టన్నుల ప్రాసెస్డ్ ఖనిజపు రాశులు వృథాగా పడి ఉన్నాయి. వాటి నుంచి దాదాపు 800 టన్నుల బంగారాన్ని వెలికి తీసే అవకాశాలు ఉన్నాయని భారత సర్కారు గుర్తించిందంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒక టన్ను ప్రాసెస్డ్ ఖనిజపు రాశి నుంచి దాదాపు 0.7 గ్రాముల బంగారాన్ని వెలికి తీయొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.  

అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి  ప్రాసెస్డ్ ఖనిజం నుంచి బంగారాన్ని వెలికితీసే సామర్థ్యం కలిగిన కంపెనీల నుంచి త్వరలోనే బిడ్స్ ను ఆహ్వానించనున్నారంటూ కథనాల్లో ప్రస్తావించారు. ఔత్సాహిక విదేశీ కంపెనీలు, స్వదేశీ కంపెనీల కన్సార్టియంకు ఈ బాధ్యతలు అప్పగించాలని సర్కారు భావిస్తోందని పేర్కొన్నారు.  అయితే ఈ వార్తలను కేంద్ర గనుల శాఖ ఇంకా ధ్రువీకరించలేదు.