BJP మంత్రులే TRS తో టచ్ లో ఉన్నరు: కర్నె ప్రభాకర్

BJP మంత్రులే TRS తో టచ్ లో ఉన్నరు: కర్నె ప్రభాకర్

బీజేపీ కుట్రా రాజకీయాలను చేస్తుందని అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.  బీజేపీ నాయకులు పలుమార్లు తమ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్తున్నరని … అయితే.. బీజేపీ కేంధ్ర మంత్రులు, నాయకులే టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారని ఆయన అన్నరు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు తమతో మాట్లాడుతున్నరని చెప్పారు. దేశంలో ఎక్కడా నైతిక విలువలతో బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు లేవని ఆయన అన్నారు.

ప్రాంతీయ పార్టీలతో బీజేపీ సఖ్యత ఉన్న సందర్భాలు లేవని అన్నారు కర్నె ప్రభాకర్. కొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై స్పంధించిన ఆయన…   డిపాజిట్లు కోల్పోవడానికి బీజేపీ చేరాలా?…….రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకోవడానికి బీజేపీలో చేరాలా అని ప్రశ్నించారు. తమిళనాడు, కర్ణాటక, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో మెజారిటీ లేకున్నా అనైతిక రాజకీయాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. బీజేపీ అనైతిక నిర్ణయం వల్ల మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చిందని తెలిపారు. తెలంగాణలో టీఆరెస్ అభివృద్ధిని నమ్ముకుంటే..బీజేపీ అరాచకన్నీ రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు.