
బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో ఈ ఏడాది హ్యాట్రిక్ సక్సెస్‌ను అందుకున్నాడు కార్తి. విరుమన్, పొన్నియన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో మెప్పించిన కార్తి, ఇటీవల తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ‘జపాన్’ అనే వెరైటీ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి రాజు మురుగన్ దర్శకుడు. ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. కార్తి కెరీర్‌లో ఇది 25వ చిత్రం. సోమవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘గోల్డ్ కలర్ షర్ట్, మెడలో పెద్ద చైన్స్, చింపిరి జుట్టు, ఒక చేతిలో గ్లోబ్, మరో చేతిలో గన్, వెనుక డ్రాగన్‌తో చూడ్డానికి చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు కార్తి. అయితే ఈ గెటప్ అంతా ఓ ఫొటో ఫ్రేమ్‌లో ఉంది. ఆ ఫొటో క్రింద సోఫాలో ఫుల్‌గా తాగేసి పడిపోయిన మరో కార్తి కనిపిస్తున్నాడు. మొత్తానికి టైటిల్ తరహాలోనే గెటప్ కూడా వెరైటీగా ఉంది. ఇందులో తన పాత్ర పేరు జపాన్ అని తెలుస్తోంది. అతనికి జంటగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.