
హీరోయిన్ ఉండదు. లవ్, రొమాన్స్ అసలే లేవు. పాటలుండవు. అసలు హీరో పెదవుల మీద ఒక చిరునవ్వు కూడా కనిపించదు. అయినా కూడా ‘ఖైదీ’ సినిమా హిట్టు కొట్టిందంటే లోకేష్ కనకరాజ్ అద్భుతమైన టేకింగే కారణం. ఓ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో, తనదైన మార్క్‌తో ఈ మూవీని తీశాడు లోకేష్. అతని టాలెంట్‌కి కార్తి అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ తోడవడంతో సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది. అందుకే సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘ఖైదీ 2’ ఉంటుందంటున్నాడు లోకేష్. రీసెంట్‌గా అతను ఈ సినిమా గురించి కొన్ని విషయాలు రివీల్ చేశాడు. ఇది సీక్వెల్ కాదట, ప్రీక్వెల్ అట. మొదటి పార్ట్‌లో జైలు నుంచి విడుదలైన కార్తి తన కూతురిని కలుసుకోవడానికి చేసే జర్నీని చూపించారు. జైలుకు వెళ్లకముందు అతనేంటి అనేది రెండో పార్ట్‌లో చూపిస్తాడట. ఫ్లాష్‌బ్యాక్‌లో అతను కబడ్డీ ప్లేయర్ అట. జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా టోర్నమెంట్స్‌లో పాల్గొని కప్పులు గెలుస్తాడట. ఫస్ట్ పార్ట్‌లో జైలు నుంచి వచ్చేటప్పుడు అతని చేతిలో ఓ సంచి ఉంటుంది. అందులో ఉన్నవన్నీ కప్పులే అని సెకెండ్ పార్ట్‌లో చూపిస్తాడట. అంత మంచి ప్లేయర్ లైఫ్‌లో ఏం జరిగిందనేదే ‘ఖైదీ 2’ అని చెప్పాడు లోకేష్. రీసెంట్‌గా అతను కమల్, సేతుపతి, ఫహాద్‌లతో తీసిన ‘విక్రమ్’ మూవీ సూపర్ హిట్టవడంతో లోకేష్ పేరు మారుమోగుతోంది. నెక్స్ట్ విజయ్‌తో కమిట్‌మెంట్ ఉంది. అది పూర్తయ్యాక ‘ఖైదీ 2’ని సెట్స్‌కి తీసుకెళ్లాలనేది ప్లాన్.