
కోలీవుడ్ స్టార్ కార్తి నుంచి వస్తోన్న సినిమా ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ‘నాలుగు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నా.. ఒక్కసారి కూడా ఎవ్వరికీ దొరకని జపాన్ అనే దొంగ పాత్రలో డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు కార్తి. సిటీ సెంటర్‌లో కన్నమేసి రెండు వందల కోట్ల విలువ చేసే నగలు ఎత్తుకుపోతాడు.
దొంగతనం జరిగిన స్టయిల్ చూసి అది జపాన్ చేసినట్టుగా ఫిక్స్ అవుతారు. అతనిపై దేశవ్యాప్తంగా 182 కేసులు ఉంటాయి. అమ్మాయిలు, గోల్డ్‌తో ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసే మాస్ ఐటెం రాజా అతను. అడ్వెంచరస్ యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగిన విజువల్స్, కార్తి లుక్, పెర్ఫార్మెన్స్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళికి విడుదల కానుంది.