కార్తీక పూజలు ప్రారంభం

కార్తీక పూజలు ప్రారంభం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు మంగళవారం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి నెల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో రాజన్నకు భక్తులు పూజలు చేయనున్నారు. ప్రతి సోమవారం స్వామికి అభిషేకం, లింగార్చన, కల్యాణ మండపంలో కార్తీక మహాపురాణ ప్రవచనాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.  కార్తీక శుద్ధ ద్వాదశిన విఠలేశ్వర స్వామి వద్ద శ్రీ కృష్ణతులసి కల్యాణం జరపనున్నారు. 

కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులు అంజన్న సన్నిధికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా టెంపుల్ ఏఈవో బుద్ధి శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు 10 వేల మంది వరకు భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. వేములవాడ/కొండగట్టు, వెలుగు: