
గతేడాది (2023) 69వ జాతీయ అవార్డ్స్ లో(69th National Awards) ఆర్ఆర్ఆర్ హవా కొనసాగింది. ఈ సినిమా ఏకంగా 6 విభాగాల్లో అవార్డులు అందుకొని సత్తా చాటింది. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా జాతీయ అవార్డ్స్ లో కూడా దమ్ము చూపించింది. ఈ ఒక్క సినిమాకు మాత్రమే కాదు..బెస్ట్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్,బెస్ట్ లిరిక్స్,బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ తో పాటు మొత్తం పది విభాగాల్లో అవార్డులను గెలుచుకొని జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తా చాటింది.
కానీ, ఈ సారి 70వ జాతీయ చలన చిత్ర అవార్డులలో మాత్రం కేవలం ఒక్క కార్తికేయ 2 సినిమాతో సరిపెట్టుకుంది. దీంతో 2024 లో తెలుగు ఇండస్ట్రీకి దారుణమైన నిరాశే మిగిలింది. యాక్టింగ్‌తో పాటు సాంకేతిక విభాగాల్లో కూడా తెలుగు సినిమాకు ఒక్క అవార్డు కూడా దక్కలేదు. అయితే, ప్రముఖ తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు దక్కడం విశేషం. కానీ, తెలుగు సినిమాకు కాకుండా..తమిళ మూవీ తిరుచిత్రాంబళం మూవీకి గాను ఉత్తమ కొరియోగ్రాపర్‌గా జానీ మాస్టర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
కార్తికేయ 2 సినిమా విషయానికి వస్తే..డివోషనల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా వచ్చిన కార్తికేయ 2 సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కృష్ణతత్వానికి యాక్షన్ అడ్వెంచరస్ అంశాలను జోడించి మంచి కమర్షియల్ హిట్ సాధించాడు.కేవలంరూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి రూ.120 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..హీరో నిఖిల్ కు పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అంతేకాకుండా 2022లో టాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ సినిమాల్లో కార్తికేయ 2 ఒకటిగా నిలిచింది.