విలేజ్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో కార్తి మెయ్యళగన్

విలేజ్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో కార్తి మెయ్యళగన్

తమిళంతో పాటు తెలుగులోనూ చక్కని గుర్తింపును అందుకున్నాడు హీరో కార్తి. శనివారం తన పుట్టినరోజు. ఈ సందర్భంగా తను హీరోగా నటిస్తున్న సినిమాల అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో బర్త్ డే విషెస్ చెప్పారు మేకర్స్. ‘96’ ఫేమ్ సి.ప్రేమ్‌‌‌‌ కుమార్ దర్శకత్వంలో కార్తి హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. 2డి ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మెయ్యళగన్’ అనే టైటిల్‌‌‌‌ను ఫైనల్ చేశారు. 

అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు. ఒక పోస్టర్‌‌‌‌‌‌‌‌లో కార్తి, అరవింద స్వామి ఒకే సైకిల్‌‌‌‌పై వెళ్తుండగా, మరో పోస్టర్‌‌‌‌‌‌‌‌లో ఎద్దుకు ఎదురుగా నిలుచుని నవ్వుతూ కనిపించాడు కార్తి. విలేజ్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కుతున్న సినిమా ఇదని అర్థమవుతోంది. త్వరలోనే ఈ మూవీ తెలుగు టైటిల్‌‌‌‌ను అనౌన్స్ చేయనున్నారు. రాజ్‌‌‌‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 

మరోవైపు సూదుకవ్వం, మాయావన్ చిత్రాల దర్శకుడు నలన్ కుమారస్వామి డైరెక్షన్‌‌‌‌లోనూ కార్తి ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ‘వా వాతియార్‌‌‌‌‌‌‌‌’ అనే టైటిల్‌‌‌‌ను ఫైనల్‌‌‌‌ చేస్తూ ఫస్ట్ లుక్‌‌‌‌ విడుదల చేశారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.