కార్తీకమాసం 2025 .. మొదటి సోమవారం ( అక్టోబర్ 27) శివపూజలో చదవాల్సిన మంత్రాలు ఇవే..!

కార్తీకమాసం 2025 .. మొదటి సోమవారం ( అక్టోబర్ 27) శివపూజలో చదవాల్సిన మంత్రాలు ఇవే..!

 పురాణాల ప్రకారం కార్తీకమాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శివాలయం.. విష్ణువు ఆలయాల్లో  పూజ చేస్తే  అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మరీ ముఖ్యంగా కార్తీక సోమవారం చేసే పూజకు ఎంతో విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ( 2025)  కార్తీక మాసం మొదటి సోమవారం అక్టోబర్​ 27న వచ్చింది.  ఆ రోజు పరమేశ్వరుడి పూజలో చదవాల్సిన మంత్రాలు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.  . 

హిందూ మతంలో కార్తీక మాసాన్ని చాలా పవిత్రంగా, ప్రత్యేకంగా భావిస్తారు. కార్తీక మాసం మొదటి సోమవారం అక్టోబర్​ 27 వచ్చింది. కార్తీక సోమవారం  శివారాధనకు చాలా ముఖ్యమైన రోజని పండితులు చెబుబుతున్నారు.  ఆ రోజున, శివుడిని భక్తితో  ఆరాధించడం వల్ల జీవితంలో ఆనందం, అభివృద్ధి లభిస్తుంది. పరమశివుడిని  స్మరించినట్లయితే, జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. శివుడు చాలా దయగలవాడు. ఆయన ఒక్క కుండ నీటితో కూడా సంతోషిస్తాడని చెబుతారు.  

శివుడిని  పూజించేటప్పుడు చదవాల్సిన మంత్రాలు

శివ గాయత్రీ మంత్రం:  ఓం తత్పురుషాయ విద్మహేమహాదేవాయ ధీమహి..తన్నో రుద్ర ప్రచోదయాత్
రుద్ర మంత్రం:  "ఓం నమో భగవతే రుద్రాయ" ( అర్థం: నేను రుద్రునికి నమస్కరిస్తాను.)
మహా మృత్యుంజయ మంత్రం : ''ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం.. ఉర్వారుకమివ బంధనన్ మృత్యోర్ముక్షీయమామృతత్''

కార్తీక సోమవారం రోజున శివాలయంలో  ఆవు నేతితోగాని, నువ్వుల నూనెతో గాని, ఆఖరికి ఆముదంతోగానీ దీపారాధన చేసిన వారు  అత్యంత పుణ్యవంతులౌవుతారని జ్ఞానులై, మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది. గత జన్మల్లో చేసిన పాపాలు కార్తీక దీపారాధన వలన కొట్టుకుపోతాయి.  పగటి వేళ ఉపవాస దీక్షను పాటించి.. రాత్రి నక్షత్ర దర్శనం తరువాత  భోజనం చేయాలి.  రోజంతా భగవంతుని ధ్యానిస్తూ ఉండాలని పండితులు చెబుతున్నారు. 
 
పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీకవ్రతం వలన హరించుకుపోతాయి. కార్తీకంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తూ ఆ రోజంతా భగవంతుని ధ్యానంలో గడిపేవాళ్లు తప్పక శివ సాయుజ్యాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.