IND vs ENG 2025: సపోర్ట్ చేసి షాక్ ఇచ్చాడు: సుదర్శన్ కోసం కరుణ్ నాయర్‌ను పక్కన పెట్టిన గిల్

IND vs ENG 2025: సపోర్ట్ చేసి షాక్ ఇచ్చాడు: సుదర్శన్ కోసం కరుణ్ నాయర్‌ను పక్కన పెట్టిన గిల్

దేశవాళీ క్రికెట్ లో అసాధారణంగా రాణించి ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలో చోటు సంపాదించిన కరుణ్ నాయర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరిగిన తొలి మూడు టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు. మూడు టెస్టుల్లో 6 ఇన్నింగ్స్ ల్లో కలిపి 131 పరుగులు మాత్రమే చేశాడు. వీటిలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీంతో నాలుగో టెస్టుకు ముందు కరుణ్ నాయర్ కు తుది జట్టులో చోటు దక్కదని భావించారు. అయితే నాలుగో టెస్టుకు ముందు రోజు గిల్ మాటలను చూస్తే కరుణ్ మాంచెస్టర్ టెస్ట్ లో మరో అవకాశం దక్కుతుందని అనుకున్నారు. 

మంగళవారం (జూలై 22) విలేఖరుల సమావేశంలో టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. గిల్ మాట్లాడుతూ.. "కరుణ్ నాయర్ చాలా బ్యాటింగ్ చేస్తాడు. తొలి టెస్టులో తన బ్యాటింగ్ పొజిషన్ లో బ్యాటింగ్ చేయలేదు. బ్యాటింగ్ పొజిషన్ మార్చుకొని ఆడడం కష్టం. కరుణ్ తో మేము మాట్లాడాము. అతను ఈ సిరీస్ లో పుంజుకుంటాడు". అని వరుసగా మూడు టెస్టుల్లో విఫలమైన కరుణ్ నాయర్ ను వెనకేసుకొచ్చాడు. దీంతో నాలుగో టెస్టులో కరుణ్ ప్లేస్ కన్ఫర్మ్ అనుకున్న దశలో టాస్ సమయంలో గిల్ బిగ్ షాక్ ఇచ్చాడు. కరుణ్ నాయర్ స్థానంలో  సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చాడు అని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

బుధవారం (జూలై 23) మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక గాయపడిన ఆకాష్ దీప్ స్థానంలో అనుషూల్ కంబోజ్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకొని తొలి టెస్ట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.