100 బ్రాంచులు ఓపెన్ చేస్తాం : మీనా హేమచంద్ర

100 బ్రాంచులు ఓపెన్ చేస్తాం : మీనా హేమచంద్ర

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  దేశం మొత్తం మీద 100 కొత్త బ్రాంచులు ఓపెన్ చేయాలని కరూర్ వైశ్యా బ్యాంక్ టార్గెట్ పెట్టుకుంది. తమ 840 వ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌ను అయోధ్యలో బ్యాంక్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ మీనా హేమచంద్ర గురువారం ప్రారంభించారు.

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 39 బ్రాంచులను ఓపెన్ చేశామని  బ్యాంక్ సీఈఓ బీ రమేష్ బాబు అన్నారు. దేశం మొత్తం మీద మరో 100 బ్రాంచులను ఓపెన్ చేస్తామని చెప్పారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో  రికార్డ్ ప్రాఫిట్ రూ.1,605 కోట్లను బ్యాంక్ సాధించింది.