
హైదరాబాద్, వెలుగు: కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) 2024-–25 ఆర్థిక సంవత్సర ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈసారి మార్చి క్వార్టర్లో
నికరలాభం 12.50శాతం వృద్ధితో రూ. 513 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 456 కోట్లుగా ఉంది.
మొత్తం 2024–-25 ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 20.99శాతం వృద్ధితో రూ. 1,942 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 1,605 కోట్లుగా ఉంది. ఇది బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభం. 2025 మార్చి 31 నాటికి బ్యాంక్ డిపాజిట్లు, అడ్వాన్సుల విలువ రూ. 1,86,569 కోట్లకు చేరుకుంది.
నికర వడ్డీ ఆదాయం 2024–-25లో 11.57శాతం వృద్ధితో రూ. 4,260 కోట్లకు చేరుకుంది. 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో నికర వడ్డీ ఆదాయం 9.11శాతం వృద్ధితో రూ. 1,089 కోట్లుగా ఉంది. స్థూల ఎన్పీఏలు 2025 మార్చి 31 నాటికి 0.76శాతంకి తగ్గాయి.