
ఇటీవల టీటీడీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ 2023 నవంబర్ 3న బీఆర్ఎస్ లో చేరనున్నారు. శుక్రవారం ఉదయం 11.30కు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాసానిని గోషామహల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని గులాబీ బాస్ కేసీఆర్ యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ముదిరాజ్ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ ఒక్క టికెట్ కేటాయించలేదు. యాభై లక్షల ఓట్లున్న తమను అధికార పార్టీ లెక్క చేయడం లేదని ముదిరాజ్ సామాజికవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ముదిరాజ్ సంఘానికి పెద్దదిక్కుగా వ్యవహరించిన కాసాని జ్ఞానేశ్వర్ చేరిక తమకు కలిసి వస్తుందని కేసీఆర్ భావించి గోషామహల్ టికెట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ALSO READ : నేను జైల్లో ఉంటానో లేదో తెలియదు.. ఆప్ను మాత్రం గెలిపించండి: అరవింద్ కేజ్రీవాల్
వివిధ కారణాలతో కేసీయార్ ఇప్పటివరకు గోషామహల్ నియోజకవర్గానికి అభ్యర్ధిని ప్రకటించలేదు. కాగా తెలంగాణలో పోటీ వద్దని అధిష్టానం తేల్చి చెప్పడంతో అసంతృప్తికి గురైన కాసాని టీడీపీకి రాజీనామా చేశారు.