వామ్మో చలి.. మైనస్ డిగ్రీల్లోకి టెంపరేచర్లు

వామ్మో చలి.. మైనస్ డిగ్రీల్లోకి టెంపరేచర్లు
  • బారాముల్లాలో మైనస్ 8.5 డిగ్రీలు
  • రాజస్థాన్‌‌‌‌లోని ఫతేపూర్‌‌‌‌‌‌‌‌లో మైనస్ 3.3
  • గడ్డకడుతున్న నీళ్లు..  పొద్దంతా పొగమంచు
  • ఈ నెల 21 దాకా ఇదే పరిస్థితి: వాతావరణ శాఖ
  • కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్‌‌‌‌లు

శ్రీనగర్/న్యూఢిల్లీ: నార్త్ ఇండియా గజగజ వణుకుతోంది. నీళ్లు గడ్డకడుతున్నాయి. పొద్దంతా పొగమంచు కమ్మేస్తోంది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. ఈ సీజన్‌‌లో సాధారణ స్థాయి కంటే దిగువకు పడిపోతున్నాయి. నార్త్ మొత్తం ఇదే పరిస్థితి. కాశ్మీర్‌‌‌‌లోని బారాముల్లాలో అతి తక్కువగా మైనస్ 8.5 డిగ్రీలకు టెంపరేచర్ పడిపోయింది. నార్త్‌‌లో ఈనెల 21 దాకా వాతావరణం ఇలానే ఉంటుందని, చలి గాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్‌‌లు జారీ చేసింది.

రాజస్థాన్‌‌లో మైనస్ 3

ఢిల్లీలో శనివారం 6 డిగ్రీలు నమోదయ్యాయి. ఇది ఈ సీజన్‌‌లోనే అతి తక్కువని వాతావరణ శాఖ వెల్లడించింది. ‘‘నార్త్‌‌ వెస్ట్ ఇండియాలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చలిగాలులు కొనసాగుతున్నాయి. ఈనెల 21 దాకా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరింత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది” అని చెప్పింది. హర్యానా, పంజాబ్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్‌‌, గుజరాత్‌‌లోని కొన్ని ప్రాంతాలు, నార్త్ రాజస్తాన్‌‌లో వచ్చే నాలుగు రోజులు తీవ్ర చలిగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియాలో వచ్చే మూడు, నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల దాకా పడిపోవచ్చని తెలిపింది. రాజస్థాన్‌‌లోని ఫతేపూర్‌‌‌‌, చురులో శుక్రవారం ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ కంటే తక్కువగా నమోదయ్యాయి. ఫతేపూర్‌‌‌‌లోని సికర్‌‌‌‌లో మైనస్ 3.3 డిగ్రీలు, చురులో మైనస్ 1.1 డిగ్రీలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో 5 డిగ్రీల్లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కోల్డ్ వేవ్ కండిషన్లు మరికొన్ని రోజులు కొనసాగుతాయని చెప్పింది. ఇక ఉత్తరాఖండ్‌‌లో ఈ నెల 21 దాకా యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని రాణిచౌక్‌‌లో అతి తక్కువగా మైనస్ 2.7 డిగ్రీలు రికార్డయ్యాయి.

వాటర్‌‌‌‌ సప్లై లైన్లు ఫ్రీజ్

కాశ్మీర్‌‌‌‌లోని శ్రీనగర్‌‌‌‌లో గురువారం మైనస్ 3.8 డిగ్రీలు నమోదు కాగా, శుక్రవారం రాత్రి మైనస్ 6 డిగ్రీలు నమోదయ్యాయి. శ్రీనగర్‌‌‌‌లో ఈ సీజన్‌‌లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన రోజు ఇదేనని ఆఫీసర్లు చెప్పారు. ఇక బారాముల్లా జిల్లాలోని గుల్‌‌మార్గ్‌‌ రిసార్టులో ఏకంగా మైనస్ 8.5 డిగ్రీలు రికార్డయ్యాయి. అమర్‌‌‌‌నాథ్ యాత్రకు బేస్ క్యాంపుగా ఉన్న పహల్గామ్‌‌లో మైనస్ 8.3 డిగ్రీలు నమోదయ్యాయి. కుప్వారాలో మైనస్ 6.1, ఖాజీగౌండ్‌‌లో మైనస్ 6, కోకెర్‌‌‌‌నాగ్‌‌లో మైనస్ 5.1 డిగ్రీలు రికార్డయ్యయి. ఉష్ణోగ్రతలు మైనస్‌‌లోకి పడిపోవడంతో నీళ్లు గడ్డకడుతున్నాయి. వాటర్‌‌‌‌ సప్లై లైన్లు మొత్తం ఎక్కడికక్కడ ఫ్రీజ్ అయ్యాయి. మరికొన్ని రోజులు ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.