
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రియురాలు, నటి సబా ఆజాద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్’. ఈ మూవీని కశ్మీర్‌కు చెందిన ప్రముఖ సింగర్ ‘రాజ్ బేగం’ జీవితం ఆధారంగా డానిష్ రెంజు తెరకెక్కించారు. ఆపిల్ ట్రీ పిక్చర్స్ ప్రొడక్షన్, రెంజు ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సోనీ రజ్దాన్, జైన్ ఖాన్ దుర్రానీ, తరుక్ రైనా, షీబా చద్దా, లిల్లేట్ దుబే, అర్మాన్ ఖేరా, చిత్తరంజన్ త్రిపాఠి, బషీర్ లోన్, శిశిర్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. అభయ్ సోపోరి సంగీతం అందించారు.
ఈ మూవీ ఆగస్టు 29 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఇందులో ప్రధానంగా రాజ్ బేగం (1927–2016) జీవితంలో ఎదురైన అడ్డంకులు, తను కశ్మీర్ లోయ నుంచి ఎలా సింగర్గా ఎదిగింది? అందుకు ఎదురైన అడ్డంకులు ఏంటనే కోణాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ ఓటీటీలో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మరి ఈ పాటల ప్రయాణం మొత్తం కథేంటో చూసేద్దాం.
Every note carries Noor Begum's story 💙#SongsOfParadiseOnPrime, New Movie, Watch Now: https://t.co/Nv4L6D9MJs#SabaAzad @Soni_Razdan #ZainKhanDurrani #TaarukRaina #SheebaChadha @renzu_danish #ShafatQazi @ritesh_sid @FarOutAkhtar #RenzuFilms @excelmovies #AppleTreePictures pic.twitter.com/Ou97fNULDR
— prime video IN (@PrimeVideoIN) August 28, 2025
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ కథ:
రేడియో కాశ్మీర్ మొట్టమొదటి మహిళా సింగర్ రాజ్ బేగం. అందరూ ఆమెని ‘మెలోడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్’గా పిలుస్తుంటారు. ఆమె లైఫ్ స్టోరీ ఇన్స్పిరేషన్తో తీసిన సినిమా ఇది. కథలోకి వెళ్తే.. వృద్ధాప్యంలో ఉన్న జెబా అక్తర్ (సోని రజ్దాన్) ఒకప్పుడు ఫేమస్ సింగర్. ఒక యువ సంగీత విద్వాంసుడు (తరుక్ రైనా) ఆమె జీవితం, సంగీతం గురించి ఒక థీసిస్ రాయాలి అనుకుంటాడు.
అందుకోసం ఆమెని ఇంటర్వ్యూ చేయాలి అనుకుంటాడు. కానీ.. జెబా అందుకు ఒప్పుకోదు. అతన్ని అస్సలు పట్టించుకోదు. కానీ.. తర్వాత అతను జెబా పాడిన ఒక పాటని హమ్ చేస్తుండడం చూస్తుంది. అతని టాలెంట్ నచ్చి అతనితో మాట్లాడటానికి ఒప్పుకుంటుంది. ఈ క్రమంలో అతనితో తన జీవిత కథ చెప్పడం మొదలుపెడుతుంది.
అప్పుడు కథ 1950ల్లోకి వెళ్తుంది. యంగ్ జెబా క్యారెక్టర్‌లో (సబా ఆజాద్) నటించింది. ఆమె తండ్రి (బషీర్ లోన్) మహిళల బట్టలు కుట్టే దర్జీ. సొంత దుకాణం తెరవాలని కలలు కంటుంటాడు. జెబాకు యుక్త వయసురాగానే ఆమె తల్లి మోజి (షీబా చద్దా) జెబాను ఒక ధనవంతుడికి ఇచ్చి పెండ్లి చేయాలి అనుకుంటుంది. కానీ.. ఆమె తండ్రి మాత్రం జెబా కోరుకున్నట్టుగా సింగర్‌ని చేయాలి అనుకుంటాడు. అలాంటి టైంలో జెబా ఒక పాటల పోటీలో గెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
విశ్లేషణ:
కొన్ని సినిమాలు అద్భుతమైన కథతో వస్తాయి. మరికొన్ని సినిమాలు సామాజిక కోణంలో మార్పు తీసుకురావడానికి వస్తాయి. సరిగ్గా ఇలాంటి ఉద్దేశ్యంతోనే వచ్చిన మూవీ 'సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్'. దర్శకుడు డానిష్ రాసుకున్న కథ, రియల్ ఇన్సిడెంట్స్పై కావడంతో దాన్ని తప్పులు లేకుండా చూపించడం అతిపెద్ద టాస్క్. ఎందుకంటే.. ఇలాంటి కథల్లో తమ ఉనికి, తమ భవిష్యత్తు, తమ నిశ్శబ్ద తిరుగుబాటు వంటి అంశాలు ఉంటాయి. ఈ అంశాలనే ప్రధాన ఎజెండాగా తీసుకుని సక్సెస్ అయ్యాడు దర్శకుడు డానిష్.
ముఖ్యంగా సినిమా మొదట్లొనే డానిష్ డ్రామాతో ముంచెత్తడానికి ట్రై చేయకుండా.. బదులుగా, ఒకప్పుడు కాశ్మీర్ లోయలో అడ్డంకులను బద్దలు కొట్టిన స్వరాన్నీ తీసుకొచ్చాడు. 20వ శతాబ్దం కాలంలో మహిళలు ఎదుర్కొన్న సామాజిక కట్టుబాట్లను కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు. అప్పట్లో ఒక అమ్మాయి బయటకు వచ్చి చదువుకోడానికే చాలా కండిషన్స్ ఉండేవి. మరి అలాంటి ఓ మహిళ ఒక రేడియోలో ఫిమేల్ సింగర్ గా మారాలి అంటే ఆమె ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొందో ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశాడు.
ఇంట్లో గెలిచి, రచ్చ గెలవాలనే సామెత మాదిరిగా.. ఆమె తన ఇంట్లో గెలిచింది. ఆ తర్వాత రేడియో సింగర్గా, రంగస్థల నటిగా, మొత్తానికి ప్రముఖ సింగర్గా ఎలా మారింది అనే విషయాలను పెపెయిన్ ఫుల్గా తెరకెక్కించి చూపించారు. ఓవరాల్గా సినిమా కథనం చాలా ఇంపాక్ట్ కలిగించేలా కథనం సాగింది. సభా ఆజాద్, సోనీ రాజధన్ అద్భుతంగా నటించారు. మిగతా వారు సైతం తమ పాత్రలకు న్యాయం చేశారు. అభయ్ సోపోరి సంగీతం సినిమాకు ఊపిరి పోసింది.