కేసీఆర్​ ఏ విషయంలోనూ న్యాయం చేయలేదు: పొన్నం ప్రభాకర్​

కేసీఆర్​ ఏ విషయంలోనూ న్యాయం చేయలేదు: పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్, వెలుగు :'కాంగ్రెస్ కట్టించిన ఇందిరమ్మ ఇండ్లలో కాళ్లు జాపుకునే జాగలేదన్నడు. ఇంటికి అల్లుడొస్తే ఉండే పరిస్థితి లేదన్నడు. అందుకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తమన్నడు. ఆ మాటదప్పిండు. పేద తల్లిదండ్రుల కొడుకులను ఎండబెట్టిండు. అల్లుండ్లను ఇంటికే రాకుంట జేసిండు. ఆయన మాత్రం ఫాంహౌజ్​లు, గడీలు గట్టుకొని సుఖంగ ఉన్నడు.' అని  కేసీఆర్ తీరును మాజీ ఎంపీ, కాంగ్రెస్ హుస్నాబాద్​ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​ ఎండగట్టారు.

ఆదివారం హుస్నాబాద్​లోని కస్తూర్బాకాలనీలో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తూ  ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.  కేసీఆర్ ఇందిరమ్మ ఇండ్లను చూపుతూ ఎద్దేవా చేశాడు కానీ పదేండ్ల కాలంలో ఒక్ డబుల్ బెడ్​రూం ఇళ్లయినా ఇచ్చాడా అని ప్రశ్నించారు.  కాంగ్రెస్ హయాంలో అర్హులైన పేదలందరికీ ఎలాంటి పైరవీలు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు కట్టించామన్నారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏ విషయంలోనూ న్యాయం చేయలేదన్నారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. భూములు పోయిన రైతులు పరిహారం అడిగినందుకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్ దన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని కోరారు.