రుణమాఫీ పేరుతో రైతులను నిండా ముంచిండ్రు : కాటిపల్లి వెంరటరమణారెడ్డి

రుణమాఫీ పేరుతో  రైతులను నిండా ముంచిండ్రు : కాటిపల్లి వెంరటరమణారెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు: రుణమాఫీ పేరుతో కేసీఆర్​ రైతులను నిండా ముంచారని  కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంరటరమణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బీబీపేట మండలం జనగామ, మాందాపూర్, పాల్వంచ మండలం ఫరీద్​పేట, బండ రామేశ్వర్​పల్లిల్లో  ఆయన ప్రచారం నిర్వహించారు. 

రమణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఫసల్​ బీమా యోజన పథకాన్ని అమలు చేయడం లేదని, అందుకే పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదన్నారు. కేంద్రం రైతులకు సబ్సిడీపై ఎరువులు సరఫరా చేస్తుందన్నారు. బీజేపీకి అవకాశమిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి  చేస్తామన్నారు.