పెళ్లయిన నాలుగేళ్లకు పేరెంట్స్ అవుతున్న స్టార్ కపుల్.. అఫీషియల్గా పోస్ట్

పెళ్లయిన నాలుగేళ్లకు పేరెంట్స్ అవుతున్న స్టార్ కపుల్.. అఫీషియల్గా పోస్ట్

బాలీవుడ్ స్టార్ కపుల్స్లో కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ ఒకరు. ఈ జంట తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నాం అంటూ గుడ్ న్యూస్ తెలిపారు. ఇవాళ మంగళవారం (2025 సెప్టెంబర్ 23న) హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్లో ఓ ఫోటో షేర్ చేస్తూ గుడ్ న్యూస్ తెలిపింది.

కత్రినా-విక్కీ కలిసున్న ఈ ఫోటోకి “మా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది”అనే క్యాప్షన్ జతచేసింది. అయితే, గత కొన్ని రోజులుగా కత్రినా కైఫ్ తల్లి కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ అప్డేట్తో నెటిజన్ల రూమర్స్కి ఎండ్ కార్డ్ పడేలా కత్రినా గుడ్ న్యూస్  తెలిపింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

2021డిసెంబర్ 9న రాజస్థాన్లో సాంప్రదాయ హిందూ వేడుకలో విక్కీ-కత్రినాల వివాహం జరిగింది. బాలీవుడ్ నివేదికల ప్రకారం, కత్రినా ఇప్పుడు మూడవ త్రైమాసికంలో ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 15 మరియు అక్టోబర్ 30 మధ్య బిడ్డకు జన్మనిస్తుందని టాక్. ఈ క్రమంలో పెళ్లయిన నాలుగేళ్లకు కత్రినా తల్లి కాబోతున్న విషయాన్ని తెలుసుకున్న సినీ సెలబ్రెటీలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ పోస్టులు ద్వారా విషెష్ అందిస్తున్నారు.

ప్రస్తుతం వీరి సినిమాల విషయానికి వస్తే.. విక్కీ కౌశల్ ఈ ఏడాది 'ఛావా' మూవీతో వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశారు. ఇది ఈ 2025 సంవత్సరం అతి పెద్ద హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం రణబీర్ కపూర్, ఆలియా భట్ లతో కలిసి ' లవ్ & వార్ ' చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు కత్రినా చివరిగా విజయ్ సేతుపతితో కలిసి' మెర్రీ కిస్మస్' లో కనిపించింది.