దానికోసం ఎంత కష్టమైనా పడతా.. జనాలు అది కూడా చూస్తారు

దానికోసం ఎంత కష్టమైనా పడతా.. జనాలు అది కూడా చూస్తారు

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రీనా కైఫ్(Katrina Kaif) నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్3(Tiger3). సల్మాన్ ఖాన్(Salman khan) హీరోగా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని మనీష్ శర్మ(Maneesh sharma) తెరకెక్కిస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా.. నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ఈ సినిమా నుండి  లెకె ప్రభు కా నామ్‌ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 

ఈ పాటకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో రికార్డ్స్ వ్యూస్ తో దూసుకుపోతోంది ఈ పాట. చాలా స్టైలీష్ గా ఉన్న ఈ పాటలో సల్మాన్, కత్రీనా డాన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటను.. అర్జిత్‌ సింగ్‌, నిఖిత గాంధీ ఆలపించారు.

ఇక తాజాగా ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్ పై కత్రినా స్పందించారు.. ఒక నటిగా నాకు ఆడియన్స్ ప్రేమాభిమానాలు అందిస్తున్నారు. లెకె ప్రభు కా నామ్‌ పాటను సూపర్ హిట్‌ చేశారు. అందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు డ్యాన్స్‌ అంటే చాలా చాలా ఇష్టం. జనాలు నటనతో పాటు.. డ్యాన్సులను కూడా కోరుకుంటారు. అందుకే ఏ పాట అయినా, ఎంత కష్టమైనా డాన్స్ అయినా బాగా చేయాలని ప్రయత్నిస్తుంటాం. ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేయకూడదనే అనుకుంటాము.. అంటూ చెప్పుకొచ్చింది కత్రీనా. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ :- ODI World Cup 2023: టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన బంగ్లా కెప్టెన్