లిక్కర్ ​స్కాంలో కవిత అరెస్ట్​ తప్పదు : వివేక్ ​వెంకటస్వామి

లిక్కర్ ​స్కాంలో కవిత అరెస్ట్​ తప్పదు : వివేక్ ​వెంకటస్వామి
  • లిక్కర్ ​స్కాంలో కవిత అరెస్ట్​ తప్పదు
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ ​వెంకటస్వామి
  • అవినీతి సొమ్ముతో బీఆర్ఎస్​ పెట్టి దేశమంతా తిరుగుతున్నరు
  • అందులో చేరుతున్న వారంతా ఔట్​డేటెడ్​ నేతలేనని కామెంట్


 హైదరాబాద్, వెలుగు: లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా లెక్కనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్​ కావడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి అన్నారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. పంజాబ్, గుజరాత్ ​ఎన్నికల్లో డబ్బు కోసం ఎమ్మెల్సీ కవితతో కేజ్రీవాల్ మాట్లాడి రూ.150 కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని, ఈ క్రమంలోనే లిక్కర్​ స్కాం జరిగిందని చెప్పారు. ఢిల్లీ, పంజాబ్​కే లిక్కర్​ స్కాం పరిమితం చేయకుండా దేశమంతా విస్తరించాలని ప్రయత్నించారన్నారు. సిసోడియా ఎలాగైతే జైలుకెళ్లారో.. అతి త్వరలోనే కవిత కూడా జైలుకు వెళ్తారన్నారు. ఈ కేసులో మరింత మందిని రానున్న రోజుల్లో అరెస్ట్​ చేసే అవకాశముందన్నారు. 
తెలంగాణ ఖజానాను 

దోచుకోవడమే కేసీఆర్ టార్గెట్

తెలంగాణలో కేసీఆర్​పై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్​ చేయడానికే బీఆర్ఎస్ ​పెట్టారని వివేక్​ చెప్పారు. రాష్ట్రంలో దోచుకున్న అవినీతి సొమ్మును ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆ పార్టీలో చేరుతున్న వారంతా ఔట్​ డేటెడ్​ నేతలేనన్నారు. దేశంలోనే అత్యంత రిచ్​పార్టీ బీఆర్ఎస్​  అని, పార్టీ ఫండ్స్​ నుంచి రూ.400 కోట్లు ఖర్చు చేసి విమానం కొన్నారని చెప్పారు. తెలంగాణ ఖజానాను దోచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్​ పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. మేఘా కృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్లను ప్రపంచంలోనే ధనికులను చేసిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ ఏడాది బడ్జెట్​లో అందరికీ ప్రయోజనం కలిగేలా కేటాయింపులు చేశారని చెప్పారు. ఉద్యోగ కల్పన, ఆయుష్మాన్​ భారత్​కు ఇంపార్టెన్స్ ఇచ్చారన్నారు. పేదల ఇండ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారని, దేశంలో ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్మెంట్​ కోసం రూ.10 లక్షల కోట్లు ఇచ్చారని తెలిపారు. రైల్వే లైన్లు, నేషనల్​ హైవేస్​కు ఎక్కువ నిధులు కేటాయించారని వివేక్​ చెప్పారు.