మునుగోడులో గెలిచేది బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డే

మునుగోడులో గెలిచేది బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డే

హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం కల్వకుంట్ల కవిత తనను ఇబ్బంది పెట్టారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ధరణి సమస్యలు పరిష్కరించాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వెంకట రమణారెడ్డిని వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. అనంతరం దీక్షలో కూర్చున్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. పలు అవినీతి కేసుల్లో కేసీఆర్ కుటుంబం జైలుకు పోవటం ఖాయమన్నారు.

లిక్కర్ స్కామ్ తో  కవిత తెలంగాణ పరువు తీశారని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కేటీఆర్ తనకు హెచ్ సీఏ అధ్యక్ష పదవి దక్కకుండా అడ్డుకుని, అడ్డదారిలో అజారుద్దీన్ ని అధ్యక్షుడిని చేశారని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. బతుకమ్మ సంబరాలు కేసీఆర్ ఆలోచన నుంచే పుట్టిందని కవిత చెప్పటం తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. మునుగోడులో గెలిచేది బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డేనని పేర్కొన్నారు . ధరణి పోర్టల్ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.