స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా.. పార్టీ సభ్యత్వానికి కూడా..

 స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా.. పార్టీ సభ్యత్వానికి కూడా..

ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసిన కవిత.. మండలి ఛైర్మన్ కు రాజీనామా లేఖను పంపించారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత బుధవారం (సెప్టెంబర్ 03) ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కవిత.. ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. 

ఈ సందర్భంగా హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. హరీష్, సంతోష్ రావులు మేకవన్నె పులులు నాన్నా అంటూ కేసీర్ కు సూచించారు. పార్టీలో వాళ్ల కంట్రిబ్యూషనే ఉందా.. నా కంట్రిబ్యూషన్ లేదా అంటూ ప్రశ్నించారు. కలికాలం కాబట్టి వాళ్ల మాటలు కొంత కాలం నమ్ముతారు అని అన్నారు. వాళ్ల ఒత్తిడి వల్లే తనను సస్పెండ్ చేశారని అన్నారు. ఒత్తిడి తెచ్చి సస్పెండ్ చేసేలా చేశారని విమర్శించారు.

►ALSO READ | హరీశ్, సంతోష్ల అవినీతిపై ..మొదటి సాక్ష్యం కవితనే చెప్పింది : ఎమ్మెల్యే కుంభం అనిల్

కాళేశ్వరం అవినీతి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరిన తరుణంలో.. మంగళవారం (సెప్టెంబర్ 2) ప్రెస్ మీట్ సందర్భంగా హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.కాళేశ్వరం అవినీతికి కారణం హరీష్ రావేనని ఆరోపించడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. దీంతో బుధవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కవిత.. రాజీనామా చేశారు.