ఇన్నిరోజులు తప్పించుకుని తిరిగిన్రు : కిషన్ రెడ్డి

ఇన్నిరోజులు తప్పించుకుని తిరిగిన్రు : కిషన్ రెడ్డి
  •  ఇప్పటికైనా విచారణకు కవిత సహకరించాలి 

 హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇన్ని రోజులు తప్పించుకుని తిరిగారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కవితను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా ఆమె ఈడీ విచారణకు సహకరించాలని సూచించారు. ఇన్ని రోజులు ఆమె సహకరించలేదు కాబట్టే.. ఈడీ అధికారులు ఆమె ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారన్నారు.

కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకునిపోతాయని చెప్పారు. అయితే, కవిత అరెస్టుకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కవిత అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ప్రధాని మోదీ రాజ్యంలో ఎవ్వరు తప్పుచేసినా జైలుకు వెళ్లకతప్పదని, దాన్ని ఎవ్వరూ ఆపలేరని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.