మెదక్/నర్సాపూర్/కౌడిపల్లి/పాపన్నపేట, వెలుగు: ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం కోసం అవసరమైతే హైదరాబాద్‌లో పోరాటం చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ఆమె శుక్రవారం మెదక్ జిల్లాలో పర్యటించారు. నర్సాపూర్‌లోని స్కూల్‌లో చిల్ట్రన్స్డే వేడుకల్లో పాల్గొని, అనంతరం రెడ్డిపల్లిలో కాళేశ్వరం ప్యాకేజీ-18 పనులను పరిశీలించారు. అక్కడ ట్రిపుల్ ఆర్‌లో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడారు. పెద్దల భూములు కాపాడేందుకే రెడ్డిపల్లి దగ్గర ట్రిపుల్ ఆర్అలైన్మెంట్మార్చారని కవిత ఆరోపించారు.
మల్లన్నసాగర్భూనిర్వాసితులు ఈ ప్రాంతంలో భూములు కొనుక్కున్నారని, మళ్లీ వాళ్ల భూములు పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డిపల్లి వద్ద ట్రిపుల్ ఆర్అలైన్మెంట్మార్పుపై స్పందిస్తూ.. ‘‘ఏ సర్వే నెంబర్లలో ఎవరి భూములు ఉన్నాయి. ఏం జరిగిందనేది వెరిఫై చేసి శనివారం ప్రెస్‌మీట్‌లో చెబుతాను. నేను ఎవరి పేరైనా గట్టిగా, బాహాటంగా చెప్తాను. అలా చెప్పినందుకే నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు” అని వ్యాఖ్యానించారు.
