V6 News

సింగిల్ నోటిఫికేషన్‎తో 4 లక్షల ఉద్యోగాలు: నిరుద్యోగ యువతకు కవిత సంచలన హామీ

సింగిల్ నోటిఫికేషన్‎తో 4 లక్షల ఉద్యోగాలు: నిరుద్యోగ యువతకు కవిత సంచలన హామీ

హైదరాబాద్: పార్టీ ఆవిర్భావ సభలో నిరుద్యోగ యువతపై మాజీ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత హామీల వర్షం కురిపించారు. రాష్ట్రంలో తన తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ అధికారంలోకి వస్తే సింగిల్ నోటిఫికేషన్‎లో 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సంచలన హామీ ఇచ్చారు. నిరుద్యోగుల కోసం 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు రుణ సాయం అందిస్తామని ప్రకటించారు.

ప్రభుత్వ హామీతో అప్పులు ఇప్పిస్తాం.. యూత్ ఎంపవర్ మెంట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తామన్నారు. యువత ఐడియాలతో వస్తే స్టార్టప్ కంపెనీలు పెట్టించే బాధ్యత నాదని భరోసా ఇచ్చారు. యువత చేతుల్లో డబ్బులు పెట్టి సంపద సృష్టిస్తామని పేర్కొన్నారు. ఉద్యమకారుల కోసం.. 2014, జూన్ 2వ తేదీ కటాఫ్ పెట్టుకుని లక్ష ఉద్యోగాలు సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చారు.