
‘గంగోత్రి’ లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా ఆకట్టుకుని.. మసూద, బలగం చిత్రాలతో హీరోయిన్‌గా విజయాలు అందుకుంది కావ్య కళ్యాణ్ రామ్. ఇప్పుడు మ్యూజిక్ వీడియోస్‌తోనూ ఇంప్రెస్ చేస్తోంది. తాజాగా ‘ఓ సెలియా’ అనే మ్యూజిక్ వీడియోలో నటించింది కావ్య. ‘ఓ సెలియా నీ సొగసులు నను తొందరబెట్టే.. నీ కన్నులతో నా గుండెను సంబరపెట్టే’ అంటూ సాగే ఈ పాటలో చీరకట్టులో ఆకట్టుకుందామె.
గణేష్ క్రొవ్విది, రిక్కీ బి, ఫిరోజ్ ఇజ్రాయెల్ ఈ మెలోడీ సాంగ్‌ను కంపోజ్ చేశారు. యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా నుండి వచ్చిన వివైఆర్‌ఎల్ సౌత్ అనే యూట్యూబ్ ఛానల్‌లో ఈ పాట అందుబాటులో ఉంది. శ్రీ సత్య, ఎస్.వినోద్ కుమార్ జంటపై చిత్రీకరించిన ‘సిన్నదాని సూపులే’ అనే మరో పాటను కూడా ఈ సంస్థ విడుదల చేసింది.