సన్ రైజర్స్ విక్టరీతో.. స్టేడియంలో డాన్స్ చేసిన కావ్య

సన్ రైజర్స్ విక్టరీతో.. స్టేడియంలో డాన్స్ చేసిన కావ్య

ఉప్పల్ స్టేడియంలో బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఘాన విజయం సాధించటమే కాకుండా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసి రికార్డ్ సృష్టించింది. హైదరాబాద్ గెలుపుతో ఫ్యాన్స్ అంత ఆనందోత్సాహాలతో మునిగిపోతున్న క్రమంలో జట్టు ఓనర్ కావ్య మారన్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. సన్ రైజర్స్ విజయం సాధించటంతో కావ్య ఆనందంతో స్టేడియంలోనే డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

కావ్య మారన్ డ్యాన్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. కలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన గత మ్యాచ్ లో హైదరాబాద్ చివరి వరకూ పోరాడి ఓడటంతో ఫ్యాన్స్ తో సహా కావ్య మారన్ కూడా నిరుత్సాహ పడింది. తర్వాత బుధవారం హైదరాబాద్ జట్టు ఘనవిజయం సాధించటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లకు గాను 277 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆరంభంలో అదరగొట్టి గెలుపుపై ఆశలు రేకెత్తించింది. ఆ తర్వాత బ్యాటర్లు తడబడటంతో 245 పరుగులకే పరిమితమై ఓటమి చవి చూసింది.