చిన్నారుల కోసం కవాసకి బైక్స్​

 చిన్నారుల కోసం కవాసకి బైక్స్​

కవాసకి మోటార్స్​ ఇండియా మార్కెట్లో కెఎక్స్ 85  కెఎల్‌‌‌‌ఎక్స్, 300ఆర్ మోటార్‌‌‌‌సైకిళ్లను విడుదల చేసింది. 2024 కవాసకి కేఎక్స్​ 85 ధర రూ.4.20 లక్షలు కాగా, కేఎల్​ఎక్స్ 300ఆర్​ ధర రూ.5.60 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). రెండు మోటార్‌‌‌‌ సైకిళ్లను చిన్నారుల కోసం తయారు చేశారు. ఇవి డర్ట్ రైడింగ్​కు అనువుగా ఉంటాయి. రెండు బైకులూ విదేశాల నుంచి కంప్లీట్లీ బిల్ట్​ యూనిట్ (సీబీయూ) రూపంలో భారతదేశానికి వస్తాయి.  కేఎక్స్​ 85 బైకు 84 సీసీ సింగిల్- సిలిండర్, టూ-స్ట్రోక్ ఇంజన్​తో వస్తుంది. ఆరు గేర్లు ఉంటాయి. ఇక 300ఆర్ బైకుకు​ 292 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ అమర్చారు. వీటికి బుకింగ్స్ మొదలయ్యాయని కవాసకీ తెలిపింది.