299 సీసీ ఇంజన్​తో కవాసకి వెర్సిస్-ఎక్స్ 300  

299 సీసీ ఇంజన్​తో కవాసకి వెర్సిస్-ఎక్స్ 300  

కవాసకి తన అడ్వెంచర్ మోటార్‌‌‌‌‌‌‌‌సైకిల్, వెర్సిస్- ఎక్స్ 300ను భారత మార్కెట్లో తిరిగి విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 3.80 లక్షలుగా నిర్ణయించింది.  ఈ బైక్ 296 సీసీ లిక్విడ్-కూల్డ్, ప్యారలల్- ట్విన్ ఇంజిన్‌‌‌‌‌‌‌‌తో వస్తుంది. 

ఆరు గేర్లు ఉంటాయి. రెండు వైపులా డిస్క్ బ్రేక్‌‌‌‌‌‌‌‌లు,  డ్యూయల్- చానల్ ఏబీఎస్​, డిజి- అనలాగ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్ట్రుమెంట్ కన్సోల్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.