
కవాసకి భారతదేశ మార్కెట్‌కు సరికొత్త డబ్ల్యూ175 ఎంవై 23 బైకును పరిచయం చేసింది. ఇందులో "స్టాండర్డ్", "స్పెషల్" ఎడిషన్లు ఉంటాయి. బైకులోని 177సీసీ ఇంజన్ 7000 ఆర్పీఎం వద్ద 13 పీఎస్ పవర్ అవుట్‌పుట్, 6000 ఆర్పీఎం వద్ద 13.3 ఎన్ఎం టార్క్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. డబ్ల్యూ175 పూర్తి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్. పూణేలోని కవాసకి మోటార్ ఆర్&డీ, టెక్నికల్ సెంటర్‌లో దీనిని డెవలప్ చేశామని కంపెనీ పేర్కొంది. ఈ బండిలో సెమీ-డిజిటల్ రెట్రోస్టైల్ స్పీడోమీటర్, సెమీ డబుల్-క్రెడిల్ ఫ్రేమ్, బ్రైట్ మల్టీ రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్, సింగిల్ చానల్ ఏబీఎస్‌తో కూడిన 270 ఎంఎం ఫ్రంట్ డిస్క్ డ్యూయల్ షాక్ రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. ఫైవ్-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఇంజన్ బ్యాలెన్సర్ మరో ఆకర్షణ. ఎక్స్ షోరూం ధర రూ.1,47,000.