ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం : ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌

ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం : ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌

కన్నూరు (కేరళ): ప్రజాస్వామ్యాన్ని, పౌరుల ఓటు హక్కును కాపాడుకోవడమే లక్ష్యంగా తాము చేస్తున్న పోరాటం ‘రెండో స్వాతంత్ర్య పోరాటం’ లాంటిదని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ పేర్కొన్నారు. కేరళలోని కన్నూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేశ్​ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 12న ఢిల్లీలో నిర్వహించే భారీ నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు. 'ఓట్ల చోరీ' ఆరోపణలతో సోమవారం కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమికి చెందిన పక్షాలు, దేశ యువత భారీ సంఖ్యలో ఢిల్లీ వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి చేరుకోకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, వారు బస చేసిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది పౌరుల మనుగడకు అత్యంత కీలకమని, ప్రస్తుత పాలకుల చేతిలో దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాల మేరకే సీఈసీ వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.