కేరళ సీఎం రేసులో కేసీ ముందంజ ?

కేరళ సీఎం రేసులో కేసీ ముందంజ ?
  • రాహుల్తో భేటీలో పాల్గొన్న 10 మంది నేతల్లో ఏడుగురి మద్దతు ఆయనకే..
  • సతీశన్‌‌‌‌‌‌‌‌, చెన్నితల పేర్లు కూడా రేసులో తొందరగా నిర్ణయం ప్రకటించాలని మిత్రపక్షాల ఒత్తిడి

న్యూఢిల్లీ: కేరళ సీఎం రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ముందంజలో ఉన్నారు. రాహుల్ గాంధీతో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్న 10 మంది నేతల్లో ఏడుగురు ఆయన పేరు సూచించినట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ భారీ విజయం సాధించినా సీఎం ఎవరనే అంశంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది. రాహుల్‌‌‌‌‌‌‌‌కు అత్యంత నమ్మకమైన నేతగా పేరున్న వేణుగోపాల్, పార్టీలో కీలక వ్యవహారాలన్నీ సమన్వయం చేస్తూ హైకమాండ్‌‌‌‌‌‌‌‌కు, రాష్ట్ర విభాగాలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారు.

గతంలో కేరళలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు కలిసొస్తున్నది. అయితే ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో సుదీర్ఘ అనుభవం సంపాదించుకున్న వీడీ సతీశన్‌‌‌‌‌‌‌‌, సీనియర్ నేత రమేశ్ చెన్నితల పేర్లు కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయి. సీఎం ఎంపిక విషయంలో కేరళ మాజీ పీసీసీ అధ్యక్షులతోనూ హైకమాండ్ సంప్రదింపులు జరుపుతున్నది.

అయితే సీఎం ఎవరనేది నిర్ణయించడం ఆలస్యమవుతుండడంపై యూడీఎఫ్ కూటమి భాగస్వామి అయిన ఐయూఎంఎల్ అసహనం వ్యక్తం చేస్తున్నది. అయితే త్వరలోనే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ కలిసి తుది నిర్ణయం ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.