ఓటమి భయంతోనే కేసీఆర్​ రెండు చోట్ల పోటీ

ఓటమి భయంతోనే  కేసీఆర్​ రెండు చోట్ల పోటీ

కామారెడ్డి, వెలుగు: ఓటమి భయంతోనే కేసీఆర్​కామారెడ్డి, గజ్వేల్​లో పోటీ చేస్తున్నారని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి విమర్శించారు. మాచారెడ్డి మండలం అంతంపల్లికి చెందిన పలువురు మహిళలు, యువకులు శనివారం బీజేపీలో చేరారు. వారికి వెంకటరమణారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్​ తొమ్మిదేండ్ల పాలనలో  చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. 

కొత్త పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దళితబంధు, బీసీ, మైనార్టీ బంధుల పేర్లతో గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీఆర్ఎస్​ కార్యకర్తలు చూస్తున్నారన్నారు. బీజేపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.